Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి

  • Nov 28, 2020, 17:18 PM IST

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నమ్మకమైన సంస్థ అని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు ఇందులో తమకు తోచినంత నగదును ఇన్వెస్ట్ (Best LIC Policies for Employees) చేస్తుంటారు. అయితే కొందరికి ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి, ఏ ప్రీమియం చెల్లిస్తే ప్రయోజనం ఏంటి అనే వివరాలపై ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే ఈ ఎల్ఐసీ పాలసీలు ఉద్యోగం చేస్తున్నవారికి బెస్ట్ ఛాయిస్ అని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ పాలసీల వివరాలు ఇవే...

1 /5

పాలసీదారుడు మొత్తం గడువు వరకు ప్రీమియం చెల్లిస్తే.. బోనస్‌తో పాటు మొత్తం ప్రీమియం నగదును పొందవచ్చు. ఏదైనా కారణాలతో ప్రీమియం చెల్లించడం ఆపివేస్తే.. ఈ సమయం నుండి రెండేళ్లలోగా పాలసీని రెన్యువల్ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే గడువు సమయంలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండ్ చేయవచ్చు. ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అమల్లో ఉన్న సమయంలో పాలసీదారుడు చనిపోతే నామినీకి మొత్తం నగదు, బోనస్‌ అందుతాయి.   Also Read :  CBSE Scholarship 2020: ఇలా చేస్తే ఆ విద్యార్థులకు ప్రతినెలా డబ్బులు!

2 /5

ఇందులో సేఫ్టీతో పాటు పొదుపు సేవలు లభిస్తాయి. ఇది LIC ఇతర పాలసీల కన్నా మెరుగైన ప్రీమియం ప్లాన్. మెచురిటీ ముగిసేవరకు ప్రీమియం చెల్లించిన పాలసీదారులకు బతికున్నంత కాలం లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీనీ అందుకోవచ్చు. LIC Jeevan Amar Plan‌లో పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసిన పాలసీదారులకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.

3 /5

ఇది ఆన్‌లైన్ టర్మ్ పాలసీ. తక్కువ మొత్తంలో టెక్ టర్మ్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. అయితే ఇది రిస్క్ ప్రీమియం ప్లాన్. పాలసీదారుడు యక్సిడెంట్ రైడర్‌ను యాడ్ ఆన్‌ ద్వారా టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. చెల్లించే ప్రీమియం ఆధారంగా చేతికి వచ్చే మొత్తం మారనుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. ఆ తరువాత అందాల్సిన డెత్ బెనిఫిట్స్‌ను 5, 10, 15 ఏళ్లలో వాయిదాలలో మూడు రకాలుగా పొందవచ్చు. 

4 /5

పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారికి జీవన్ ఉమాంగ్ (LIC Jeevan Umang) మంచి ఆలోచన. ప్రీమియం గడువు ముగిసేవరకు సరిగ్గా చెల్లిస్తే.. మెచూరిటీ గడువు వరకు ప్రతి ఏడాది సర్వైవల్ బెనిఫిట్స్‌ అందుతాయి. ప్రమాదవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి ఒకేసారి మొత్తం నగదు చెల్లిస్తారు. జీమన్ ఉమాంగ్ లైఫ్ కవరేజీ తీసుకుంటే.. పాలసీ ముగిసిన తరువాత పాలసీదారులు ప్రతి సంవత్సరం మనీబ్యాక్‌ పొందవచ్చు.

5 /5

ఇందులో పాలసీదారుడు ఒకేసారి నగదు మొత్తాన్ని అందుకుంటారు. అయితే మెచూరిటీ గడువు ముగిసేవరకు నగదు సరిగ్గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదశాత్తూ పాలసీదారుడు చనిపోతే ఆ కుటుంబానికి జీవన్ లాభ్ ప్లాన్ ద్వారా నగదు చేతికి వస్తుంది. ప్రీమియంతో పాటు అదనపు బోనస్‌లు అవకాశం ఉంటే పాలసీదారుడు గతంలో పేర్కొన్న నామినీకి నగదు అందుతుంది. ఇతర ప్రీమియాలకు ఇది కాస్త భిన్నం. ఇది ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.  Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్